May 15, 2026
Explore
గంజాయి అక్రమ రవాణా నిందితుడికి 2 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష,జరిమానా

గంజాయి అక్రమ రవాణా నిందితుడికి 2 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష,జరిమానా

May 15, 2026 | Andhra Pradesh

: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

అనకాపల్లి ముచ్చట్లు:

మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి గౌరవ న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. విశాఖపట్నం 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ నేరం నిరూపితమైన నిందితుడికి 02 సంవత్సరాల 07 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు ₹5,000/- జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు వెలువరించారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో, అదనంగా మరో నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
​శిక్ష పడిన నిందితుడి వివరాలు:
పుష్పరాజ్ (A-4), తండ్రి: థంకరాజ్ (54 ఏళ్లు)
​చిరునామా: విల్లవంకోడ్, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు రాష్ట్రం.

​కేసు నేపథ్యం:
నవంబర్ 08, 2023న అప్పటి మాకవరపాలెం ఎస్సై పి.రామకృష్ణ రావు తమ సిబ్బందితో కలిసి పైడిపాల జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసి తప్పించుకోబోతున్న నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకోగా, వారి వద్ద 07 కిలోల గంజాయి లభ్యమైంది. ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని తమిళనాడుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.

సమర్థవంతమైన దర్యాప్తు – ప్రాసిక్యూషన్:
ఈ కేసులో అప్పటి ఎస్సై పి.రామకృష్ణ రావు సమగ్ర విచారణ చేపట్టగా, ప్రస్తుత సబ్-ఇన్స్పెక్టర్ డి.దామోదర్ నాయుడు పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్ ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించి నేరాన్ని నిరూపించారు.

ఈ తీర్పుపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హర్షం వ్యక్తం చేశారు. గంజాయి సాగు, రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, ఈ శిక్ష నిందితుల్లో భయాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. కేసును ప్రతిభావంతంగా దర్యాప్తు చేసిన ఎస్సైలు పి.రామకృష్ణ రావు, డి.దామోదర్ నాయుడు లను, వాదనలు వినిపించిన ఏపీపీని, మాకవరపాలెం పోలీస్ సిబ్బందిని మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags: Cannabis Trafficking Accused Sentenced to 2 Years and 7 Months in Prison, Plus Fine