May 15, 2026
Explore
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం…

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం…

May 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కుటుంబం అంటే భార్య భర్త కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు. తల్లీ తండ్రి, అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు కలిసికట్టుగా ఉంటే అదో.. ఆదర్శ కుటుంబం, మంచి కుటుంబం, బంగారు కుటుంబం.. అనొచ్చు. మన కుటుంబ గౌరవం కాపాడటానికి ఏమాత్రం వెనుకాడకూడదు. ఇదో.. ఉమ్మడి కుటుంబం.. వ్యవస్థ. అతి ప్రాచీనమైన మంచి వ్యవస్థ ఇది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు, సహాయ సహకారాలు ఉంటే ఆ కుటుంబ పరంపర కొనసాగుతుంది. మన ఇంటిపేరే మనకో గౌరవం తెచ్చిపెడుతుంది. ఇంటిపేరుతోనే ప్రఖ్యాతులైన వారు ఎంతోమంది ఉన్నారు. సిరిసంపదలు కన్నా గౌరవ ప్రతిష్టలే ముఖ్యం. మన కుటుంబ ప్రతిష్టను మనమే హైట్స్ కి తీసికెళ్ళగలగాలి. ఐతే గత మూడు దశాబ్దాలుగా పారిశ్రామికరణ, ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ అభివృద్ధి వలన జీవనశైలిలో పెను మార్పులు, ఆలోచనా విధానంలో మార్పులు, స్వార్ధ చింతన, సంపాదనే లక్ష్యం.. వంటి పలు కారణాల వలన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అటాచ్మెంట్ ప్లేస్ లో డిటాచ్మెంట్ చోటుచేసుకుంది. పిల్లలికి మేనమామ మేనత్త పిల్లలు ఎవరో కూడా తెలియకుండా పోతోంది. దగ్గరి సంబంధాలు కలుపుకోవడం తగ్గిపోయి, ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ప్రేమ ప్రేమ అంటూ యువత ఎగబడటం మొదలైంది.

బాంధవ్యాలు కుంటు పడుతున్నాయి. చదువులు కేరీర్ లైఫ్ స్టైల్ అంటూ దూరదేశాలకు విదేశాలకు వెళ్లి సెటిలవ్వడంతో, కని పెంచి చదివించి ప్రయోజకులిని చేసిన తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ కుప్పకూలింది. ఇది దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్యసమితి 1994 లో ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరపాలని నిశ్చయించింది. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసేవిధంగా పలు చర్యలు తీసుకుంటు న్నప్పటికీ ఫలితాలు పెద్దగా కనపడటం లేదు. కుటుంబం ఐక్యంగా ఉంటేనే ఆ కుటుంబంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే బలం ఉంటుంది.. పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యులంతా ఒకచోట ఉండకపోయినా అవసరం వచ్చినప్పుడు నిలబడాలి.

ఇటువంటి అంశాలలో అవగాహన కల్పిచడమే ధ్యేయంగా ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా యు ఎన్ ఓ సంస్థ కార్యక్రమాలు చేపడుతుంది. కలసివుంటే కలదు సుఖం అని అప్పుడు అనుకునేవారం. ఒక స్పష్టమైన మార్పు ఏమిటంటే.. మన దగ్గర బంధువులు వస్తే సరదా పడే వాళ్ళం. వాళ్ళు వెళ్ళిపోతారంటే ఏడుపు వచ్చినంత పని అయ్యేది. ఇప్పుడా పరిస్థితే లేదు. ఆ రోజులు తిరిగిరావు. కనీసం ఐదారుగురు పిల్లల్ని కనేవాళ్ళం. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ మరింత పటిష్టం అయ్యేది. ఇప్పుడు పేరెంట్స్ కి, తోడపుట్టిన వారికి దూరంగా ఉంటూ.. వన్ ఆర్ నన్ పద్ధతిలో నేటి యువతరం ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం ఊసే ఉండదు. ఆరోజులు.. ఆ బంధుత్వాలు.. ఆ బంధాలు.. నేటికీ మనకి మరపురాని జ్ఞాపకాలే కదా.‌

Tags:International Day of Families…