May 15, 2026
Explore
మే 30 నుంచి తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభం

మే 30 నుంచి తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభం

May 15, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణతో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో, మే 30 నుండి దశలవారీగా ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.

ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు కానున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అక్కడ సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) కార్యక్రమ షెడ్యూల్‌ను తదనంతరం ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
సర్ మూడవ దశలో భాగంగా, 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారు. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, గోవా, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో సర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అస్సాంలో మాత్రం ఒక “ప్రత్యేక సవరణ” కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags: The SIR process begins in 16 states, including Telangana, starting May 30.