పల్నాడు ముచ్చట్లు:
అత్యాచార ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సస్పెన్షన్‌లో ఉన్న సీఐ చిన్నమల్లయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు పూర్తికావడంతో తగిన ఉత్తర్వులు తర్వాత ఇస్తామని న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ తెలిపారు. తీర్పును రిజర్వ్ చేశారు.
పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది ఏప్రిల్ 29న వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపణలు వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో వచ్చాయని వాదించగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని, ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.
నిందితుడు పరారీలో ఉన్నారని, బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
Tags: CI Chinnamallaiah Seeks Anticipatory Bail in Rape Case; Verdict Reserved