గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన సువిక్షిత్ బొజ్జా, గీతిక రతన్ జంటగా నటించిన “దూరదర్శిని కలిపింది ఇద్దరిని” సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందని లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ షేక్ మహమ్మద్ తెలిపారు.
వారాహి బ్యానర్‌పై కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1990ల నేపథ్యంలోని ప్రేమకథగా తెరకెక్కిందని చెప్పారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సువిక్షిత్ బొజ్జా నటనను అందరూ ఆదరించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.
Tags: ‘Doordarshini Kalipindi Iddarini’ — Ready for Release