May 14, 2026
Explore
ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ మెరుపు దాడులు

ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ మెరుపు దాడులు

May 14, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోటలో గత నాలుగు రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారి శివన్నారాయణ ఆదేశాల మేరకు ఏడీఏ శ్రీలత ఆధ్వర్యంలోని స్క్వాడ్ పలు దుకాణాలను తనిఖీ చేసింది.

బాలాజీ ఆగ్రో నీడ్స్‌లో బిల్లులు లేని రూ. 6.64 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపివేసి, బయో స్టిములెంట్ మందులపై షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే వెంకట సాయి, సంకల్ప, మన గ్రోమోర్, పుడమి కిసాన్ మార్ట్ వంటి దుకాణాల్లోనూ రికార్డులు సరిగ్గా లేనందున విక్రయాలను నిలిపివేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Tags: Agriculture Department Conducts Surprise Raids on Fertilizer Shops