తమిళనాడు ముచ్చట్లు:
సీఎం విజయ్ కార్ డ్రైవర్ కొడుకు ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియామకం. కార్ డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు శబరినాథ్‌కు టికెట్ ఇచ్చిన విజయ్. చెన్నై జిల్లా విరుగంబాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శబరినాథ్. తమిళనాడు అసెంబ్లీలో నిన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. శబరినాథ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించిన సీఎం విజయ్. కార్ డ్రైవర్ కొడుకును MLAగా గెలిపించుకోవడమే కాకుండా.. తనను నమ్మిన వారికి విజయ్ సముచిత స్థానం కల్పించారన్న ప్రశంసలు. కారు డ్రైవర్ కొడుకు శబరినాథ్‌కు MLAగా అవకాశం కల్పించిప్పుడే.. విజయ్ పట్ల సోషల్ మీడియాలో, ప్రజల్లోనూ మంచి రెస్పాన్స్. తాజాగా శబరినాథ్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్‌గా నియమించడంతో విజయ్‌కు ప్రశంసల వెల్లువ.
Tags: The car driver’s son is now the Government Chief Whip.