May 14, 2026
Explore
మదనపల్లెలో అనధికారిక సైలెన్సర్లపై ప్రత్యేక తనిఖీలు

మదనపల్లెలో అనధికారిక సైలెన్సర్లపై ప్రత్యేక తనిఖీలు

May 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో వాహనాలకు అనధికారికంగా మార్పులు చేసిన సైలెన్సర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ నిర్ణయాల మేరకు జిల్లా రవాణా అధికారి ఆధ్వర్యంలో 12 మెకానిక్ వర్క్‌షాప్‌లను తనిఖీ చేశారు. ఇందులో మూడు వర్క్‌షాప్‌లలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు, నిబంధనలకు విరుద్ధమైన యాక్సెసరీస్ అమర్చినట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులకు హెచ్చరికలు జారీ చేసి, భవిష్యత్తులో మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Tags: Special Inspections on Unauthorized Silencers in Madanapalle