May 14, 2026
Explore
సంబేపల్లెలో యువకుడు ఆత్మహత్య

సంబేపల్లెలో యువకుడు ఆత్మహత్య

May 14, 2026 | Andhra Pradesh

సంబేపల్లె ముచ్చట్లు:

సంబేపల్లె మండల కేంద్రంలోని నామాలగుట్టకు చెందిన శాంతల హరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. పోలీసుల వివరాల మేరకు రమేశ్, కన్నమ్మల కుమారుడు హరి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలిస్తుండగా బుధవారం నల్లగంగమ్మ ఆలయం సమీపంలోని కొండపై ఉరికి వేలాడుతున్న స్థితిలో గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కువైట్‌లో పనిచేస్తున్న తల్లి పంపిన డబ్బులో కొంత మొత్తం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారని, మనస్తాపంతో హరి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు తెలిపారు.

Tags: Youth commits suicide in Sambepalle