May 13, 2026
Explore
ఊపిరి పీల్చుకున్న విజయ్.. గొప్ప ఊరట.. ఇక ఢోకా లేదు..

ఊపిరి పీల్చుకున్న విజయ్.. గొప్ప ఊరట.. ఇక ఢోకా లేదు..

May 13, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు అనేక రకాలుగా ఇబ్బందులు పడిన టీవీకే అధినేత విజయ్.. ఆ తర్వాత వరుసగా ఎదురవుతున్న పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారు.అందులో అంచనాలకు అందని విధంగా విజయాలు సాధిస్తూ అదరగొడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఇటీవల తన తొలి స్పీచ్ లో దంచిగొట్టిన విజయ్.. స్పీకర్ విషయంలో, డిప్యూటీ స్పీకర్ విషయంలో తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు ఆ పదవులు లభించే విధంగా చూసుకున్నారు. ఇప్పుడు విశ్వాస పరీక్షలోనూ అదరగొట్టారు విజయ్.

తమిళనాడులో బుధవారం టి వి కే విజయ్ ప్రభుత్వానికి బల పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో విజయ్ విజయం సాధించారు. అసెంబ్లీలో బుధవారం విశ్వాస పరీక్ష నిర్వహిస్తే.. టీవీ కేకు ఏకంగా 144 ఓట్లు వచ్చాయి. విజయ్ పార్టీకి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, అన్న డీఎంకేకు సంబంధించిన కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. అన్న డీఎంకేకు సంబంధించిన 22 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. డీఎంకే ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. పైగా వాక్ అవుట్ కూడా చేసింది.విశ్వాస పరీక్షలో ఏకంగా 144 ఓట్లు సాధించి విజయ్ తన ప్రభ

Tags: Vijay breathes a sigh of relief… immense relief… no more worries.