May 13, 2026
Explore
కర్నూలు ట్రాఫిక్ ఎస్సై సర్వీస్ నుంచి తొలగింపు

కర్నూలు ట్రాఫిక్ ఎస్సై సర్వీస్ నుంచి తొలగింపు

May 13, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఎస్సై హరిప్రసాద్ను సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్కు చెందిన అధికారి. నంద్యాల జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన ఈయనకు వివాదాస్పద పోలీసు అధికారిగా పేరుంది.

గతంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న సమ యంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ను రెండోసారి డబ్బు కోసం వేధించ డంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ.. సెల్ఫీ వీడియోను మంత్రి లోకే శ్కు పంపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన డీజీపీ ఎస్సై హరిప్రసాద్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఐజీ ఆయన్ను సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ తొల గించిన తర్వాత చిత్తూరు జిల్లాలో కొంతకాలం పనిచేశారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన కర్నూలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

కొన్నేళ్ల కిందట నంద్యాల జిల్లాకు చెందిన ఓ యువతికి మాయమాటలు చెప్పి లోబ ర్చుకున్నారు. మూడేళ్ల పాటు సన్నిహితంగా ఉన్న ఆమెకు ఎస్సై వ్యవహారం తెలిసి దూరంగా ఉంటూ మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేసుకుంది.

దీంతో ఎస్సై ఆమెను వేధిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఆమె వ్యక్తిగత ఫొటోలు.. గతంలో అత నితో దిగిన ఫొటోలను ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి పంపి వివాహాన్ని చెడగొ ట్టారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవమని తేలడంతో హరిప్రసాద్ను తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు.

Tags: Kurnool Traffic SI Dismissed from Service