సోమనాథ్ తీరంలో ‘ఆపరేషన్ క్లీన్-అప్’..
సోమనాథ్ ముచ్చట్లు:
అమావాస్య రాత్రి..గుజరాత్ తీరంలోని ఆకాశం నిశ్శబ్దంగా ఉంది, కానీ గాలిలో ఏదో పెను సంచలనం దాగి ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఆలయ ప్రాంగణం వెనుక, సముద్రపు అలల హోరును మించి యంత్రాల గర్జన మొదలైంది.
అర్ధరాత్రి గర్జించిన బుల్డోజర్లు
ఎవరికీ చిక్కకుండా, అత్యంత రహస్యంగా ప్లాన్ చేసిన ఆపరేషన్ అది. ఆలయ పరిసరాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అక్రమ కట్టడాలు, ఆక్రమణల చెర నుండి ఆ పుణ్యక్షేత్రానికి విముక్తి కలిగించే సమయం ఆసన్నమైంది..
నగరం నిద్రిస్తున్న వేళ..వెలుగు జిమ్మే సెర్చ్ లైట్ల మధ్య రణరంగం సిద్ధమైంది..
- 36 జేసీబీ (JCB) యంత్రాలు ఒకేసారి రంగంలోకి దిగాయి.
- 10 భారీ హిటాచీ హైడ్రాలిక్ హామర్లు కాంక్రీట్ గోడలను పిండి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
- 400కు పైగా ట్రాక్టర్ ట్రాలీలు నిరంతరాయంగా శిథిలాలను తరలించేందుకు బారులు తీరాయి.
ఆలయానికి అత్యంత సమీపంలో, సముద్ర తీరాన్ని ఆనుకుని వెలసిన అక్రమ మసీదులు, మదర్సాలు మరియు అనధికారిక నివాసాలపై ఉక్కుపాదం మోపారు. అది కేవలం కూల్చివేత కాదు, ఒక చారిత్రక ప్రక్షాళన!
శక్తివంతమైన హైడ్రాలిక్ హామర్లు ఒక్కో దెబ్బ కొడుతుంటే, అక్రమంగా నిర్మించిన గోడలు పేకమేడల్లా కూలిపోయాయి. వేల సంఖ్యలో ఉన్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అడ్డు చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయారు. తెల్లవారుజాము అయ్యేసరికి, ఆ ప్రాంతం అంతా మైదానంగా మారిపోయింది..
సముద్రం పాలైన శిథిలాలు
రాత్రంతా సాగిన ఈ మెరుపు దాడిలో, అక్రమ కట్టడాల ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. కూల్చివేసిన వ్యర్థాలన్నింటినీ ట్రాక్టర్ల ద్వారా సముద్రపు అంచులకు తరలించి పారేశారు..
శతాబ్దాల నాటి సోమనాథ్ ఆలయ పవిత్రతను కాపాడేందుకు, ఆక్రమణల నీడను తొలగిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ ‘బుల్డోజర్ యాక్షన్’ ఒక సంచలనంగా నిలిచిపోయింది.
సూర్యోదయానికి సోమనాథుని ఆలయం కొత్త కళతో, ఆక్రమణలు లేని విశాలమైన తీరంతో వెలిగిపోయింది!
75 ఏళ్ల అమృత్ మహోత్సవ్ సందర్భంగా సోమనాథునికి ఇంతకు మించిన నివాళి ఏముంటుంది!?..
Tags: Massive Demolitions at the Somnath Shrine