కేరళం ముచ్చట్లు:
కేరళంలో కాంగ్రెస్(UDF) ఘనవిజయం సాధించినా.. ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. కేసీ వేణుగోపాల్ను సీఎం చేస్తే వయనాడ్ మరో అమేథీ అవుతుందంటూ రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా సొంత పార్టీ వర్గాలే పోస్టర్లు వేయడం సంచలనమైంది. వేణుగోపాల్, వీడీ సతీశన్, చెన్నితల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కడంతో.. అధిష్టానం నేడు ఢిల్లీలో జరిపే మంతనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Tags; CM Chair Sparks Turmoil in Kerala Congress