పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని ఓ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన మందా నాగరాజుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. 2022 మేలో అర్ధరాత్రి నిద్రిస్తున్న బాలికపై నాగరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నరసరావుపేట దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సోమవారం ఈ శిక్షను ఖరారు చేశారు.
Tags: Indecent Behavior Towards a Girl: Five Years’ Imprisonment