May 12, 2026
Explore
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం

నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం

May 12, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

నిడబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం సృష్టించాయి.

రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించగా..,

వారిని అడ్డుకునేందుకు వెళ్లిన జీఆర్పీ పోలీసులపై రాళ్ల దాడి జరిగింది.

దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం గాలిలోకి 10 రౌండ్లు కాల్పులు జరిపారు.

దుండగులు రైల్వే సిగ్నల్ వైర్లను కత్తిరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కాల్పుల అనంతరం వారు చీకటిని ఆసరాగా చేసుకుని పరారయ్యారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Tags: Shooting Scare at Nidubrolu Railway Station