May 9, 2026
Explore
నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఎన్ ఎస్ రాజా సుబ్రమణి

నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఎన్ ఎస్ రాజా సుబ్రమణి

May 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి (రిటైర్డ్)ని ప్రభుత్వం నియమించింది. భారత సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం సీడీఎస్ గా ఉన్న జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30తో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జనరల్ రాజా సుబ్రమణి ఆ పదవిలో కొనసాగనున్నారు.

మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. మే 31న బాధ్యతలు స్వీకరించి డిసెంబర్ 31, 2028 వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు.

Tags: Subramani as New Chief of Defence Staff