May 8, 2026
Explore
ఆడబిడ్డ ప్రతి ఇంటికి మహాలక్ష్మి లాంటిదే: ఎమ్మెల్యే

ఆడబిడ్డ ప్రతి ఇంటికి మహాలక్ష్మి లాంటిదే: ఎమ్మెల్యే

May 8, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో “బేటీ కో బచావో – బేటీ కో పడావో” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథిగా హాజరై పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఉచిత ఫైల్స్, ఫోల్డర్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డ ప్రతి ఇంటికి లక్ష్మీదేవితో సమానమని, బాలికలను చదివించి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహిళల కోసం కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.

మదనపల్లి నియోజకవర్గంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులకు ఇంటి స్థలం, నిర్మాణం కోసం రూ.3 లక్షల సహాయం త్వరలో అందజేస్తామని తెలిపారు.

Tags; A daughter is like Goddess Mahalakshmi to every household: MLA