జమ్మూ కాశ్మీర్ ముచ్చట్లు:
జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఆ కేంద్రపాలిత ప్రాంత పోలీసు విభాగం మధ్య గురువారం ఒక కీలక ఒప్పందం (Addendum) కుదిరింది. పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత, సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డీజీపీ నళిన్ ప్రభాత్, బ్యాంక్ ఎండి అమిత్ ఛటర్జీ ఈ ఒప్పందం పై సంతకాలు చేశారు. ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసులకు బ్యాంకింగ్ సేవల ద్వారా అండగా నిలవడమే దీని ప్రధాన ఉద్దేశం.
Tags: Jammu and Kashmir Bank Takes Key Decision for Police Welfare