May 7, 2026
Explore
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి

May 7, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
  • దేశ సేవలో అల్లూరి సీతారామరాజు త్యాగాలను స్మరించుకున్న పోలీస్ శాఖ.
  • యువత దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపు.

అమరవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకటరావు (పరిపాలన), రవి మనోహరచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసరావు (సాయిధ దళం), ఎస్‌బి డీఎస్పీ గీతా కుమారి , ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Tags:Death Anniversary of Freedom Fighter Alluri Sitarama Raju