May 6, 2026
Explore
తంబళ్లపల్లెలో రోడ్డు ప్రమాదం – రైతుకు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లెలో రోడ్డు ప్రమాదం – రైతుకు తీవ్ర గాయాలు

May 6, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:

తంబళ్లపల్లె మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తంబళ్లపల్లెకు చెందిన రైతు ఎస్. వెంకటరమణ సొంత పనిపై బైక్‌పై దండువారిపల్లెకు బయలుదేరాడు.

దారిలో దండువారిపల్లె సమీపంలో రోడ్డు పక్కన లైట్లు ఆర్పి నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను గుర్తించలేక ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags; Road Accident in Tamballapalle – Farmer Seriously Injured