కురబలకోట ముచ్చట్లు:
కురబలకోట మండలంలో మంగళవారం తేనెటీగల దాడిలో పలువురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ముదివేడుకు చెందిన నిర్మలమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, నిర్మలతో పాటు పిల్లలు గీతిక, ఫియాన్సి తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా పెద్ద తేనెటీగల గుంపు దాడి చేసింది.
ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందుతోంది.
Tags: Bee Attack in Kurabalakota – Several Injured