May 5, 2026
Explore
కుటుంబంతో ‘దళపతి’ సంబరాలు:

కుటుంబంతో ‘దళపతి’ సంబరాలు:

May 5, 2026 | Andhra Pradesh

విజయ్ విజయోత్సవ ఫోటోలు వైరల్

తమిళనాడు తమిళనాడు

తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో, విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్న ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన పార్టీ భారీ ఆధిక్యంలో ఉండటంతో చెన్నైలోని తన నివాసంలో విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
విజయ్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
విజయ్ కుటుంబ సభ్యులు మరియు మద్దతుదారులు తమ పార్టీ గుర్తు అయిన ‘విజిల్’ వేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు.

Tags: ‘Dalapathi’ Celebrates with Family