May 5, 2026
Explore
విలేకరి + ఆటో డ్రైవర్ = మహిళపై అఘాయిత్యం

విలేకరి + ఆటో డ్రైవర్ = మహిళపై అఘాయిత్యం

May 5, 2026 | Andhra Pradesh

ఒంటిమిట్ట ముచ్చట్లు:

ఒంటిమిట్ట హరిత హోటల్‌లో.. ఘటన

విలేకరి నాలుకను మహిళ కొరకడంతో…

తెగి కింద పడిన విలేకరి నాలుక

హోటల్ సిసి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు

పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్

బాధిత మహిళ కోసం గాలింపు

ఒంటిమిట్ట హరిత హోటల్‌లో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.

ఓ పత్రికలో పనిచేస్తున్న విలేకరి పుచ్చ కాయల వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల కాయలను కొనుగోలు చేసి తెచ్చారు.

కూలీల్లో ఓ మహిళ ఉండడంతో మాటలు కలిపారు. అనంతరం ఆటో డ్రైవర్‌ అయిన యజమాని, మహిళ కలిసి మద్యం తాగారు.

ఆ తర్వాత హరిత హోటల్‌ ప్రాంగణంలో ఉన్న గదికి ముగ్గురూ వచ్చారు.

ఎలాంటి రుసుము చెల్లించకుండా, అనుమతి తీసుకోకుండా అక్రమంగా ప్రవేశించడానికి వీల్లేదని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అడ్డుకున్నా వినిపించుకోలేదు.

ఆ తర్వాత మహిళపై పట్టపగలే ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో విలేకరి, ఆమె మధ్య పెనుగులాట చోటుచేసుకుని ఆమె అతని నాలుకను బలంగా కొరకడంతో తెగి కిందపడింది.

ఈ ఘటనతో భయపడి బయటికి పరుగులు తీసిన విలేకరి.

ఒంటిమిట్ట పీహెచ్‌సీకి చేరుకుని ప్రథమ చికిత్స చేయించుకున్న విలేకరి.

అనంతరం కుటుంబ సభ్యులు 108 వాహనంలో అతన్ని కడప రిమ్స్‌కు తరలించారు.

బాధితురాలిని ఆటో యజమాని స్థానిక రైల్వేస్టేషన్‌లో విడిచి పెట్టారు.

ఈ పంచాయితీ పోలీసుల దృష్టికి వెళ్లడంతో హరిత హోటల్‌కు సోమవారం చేరుకుని విచారించారు.

Tags: Journalist + Auto Driver = Assault on a Woman