May 5, 2026
Explore
అరుదైన దేవాంగ పిల్లి దర్శనo

అరుదైన దేవాంగ పిల్లి దర్శనo

May 5, 2026 | Andhra Pradesh

చిట్వేల్ ముచ్చట్లు:

చిట్వేల్ లో అరుదైన దేవాంగ పిల్లి దర్శనమిచ్చింది. చిట్వేల్ మండలం అనుంపల్లి చెక్‌పోస్ట్ సమీప అటవీ ప్రాంతంలో అటుగా వెళ్తున్న స్థానికులకు ఈ జంతువు కనిపించింది. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి చేరుకుని దేవాంగ పిల్లిని సురక్షితంగా పట్టుకున్నారు.

అనంతరం ఎస్ఆర్వో శ్రీనివాసులు, ఎఫ్‌బీవో కరీముల్లా ఆధ్వర్యంలో దానిని కూటాలమర్రి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అరుదైన ఈ జంతువు దర్శనమివ్వడంతో స్థానికులు ఆసక్తి వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను కాపాడాలని అధికారులు సూచించారు.

Tags: Sighting of a Rare Slender Loris