May 5, 2026
Explore
అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు ఆరు రోజుల సాధారణ జైలు శిక్ష

అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు ఆరు రోజుల సాధారణ జైలు శిక్ష

May 5, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు ఆరు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. అర్బన్ సీఐ వెంకటాచలపతి తెలిపిన వివరాల ప్రకారం, రాయచోటి మాసాపేట రెడ్డివారి పల్లికి చెందిన గండి సురేష్ (38) ఈ నెల 2న సాయంత్రం మద్యం సేవించి ప్రజలు, మహిళలపై అసభ్య పదజాలంతో దుర్వ్యవహరించాడు.

అంతేకాకుండా బట్టలు విప్పి నగ్నంగా ప్రవర్తిస్తూ అల్లరి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు హాజరు పరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సి. వెంకట రమణమూర్తి ఆరు రోజుల జైలు శిక్ష విధించారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags: Court sentences man to six days in simple jail for indecent behaviour