తిరుపతి ముచ్చట్లు:
సోషియల్ మీడియాలో తిరుపతి జిల్లాలోని నాగలాపురం గ్రామంలో వెలసిన శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం అని వస్తున్న వార్తలు వాస్తవం కాదు.
ఈరోజు స్థానిక ఎమ్మెల్యే స్వామివారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే సందర్భంలో ఆయనతో పాటు వచ్చిన వ్యక్తిగత గన్ మెన్ గన్ తీసుకుని రావడంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారించడం జరిగింది.
అయినా కూడా సదరు గన్ మెన్ దర్శనానికి వెళ్లకుండా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేను వెలుపలకు తీసుకొచ్చే క్రమంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారించినా వినకుండా ఆశీర్వాద మండపం వరకు వెళ్లడం మరియు స్థానిక ఎమ్మెల్యేతో పాటు వెలుపలకు రావడం జరిగింది.
టీటీడీ నిబంధనలను సదరు గన్ మెన్ కు సవివరంగా తెలియజేసినప్పటికీ ఆయన నిబంధనలను ఉల్లంఘించడంపై తక్షణ చర్యలకు జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడం జరిగింది.
Tags: The reports circulating regarding a failure on the part of the TTD security personnel are not true.