March 15, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

March 15, 2026 | Andhra Pradesh

  • ఇద్దరికి గాయాలు

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని భీమగానిపల్లె సమీపంలో గల శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం కూడలీలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటన ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పట్రపల్లెకి చెందిన సుబ్బిరెడ్డి(65) పుంగనూరుకు సొంత పనులపై వస్తుండగా, పుంగనూరు నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఎన్‌ఎస్‌.పేటకు చెందిన నజీర్‌(35 ) నదీమ్‌ (30) భీమగానిపల్లె సర్కిల్‌ వద్దకు రాగానే శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సుబ్బిరెడ్డి అక్కడేక్కడే మృతి చెందాడు. గాయపడిన బాధితులను స్థానికులు గమనించి 108కు సమాచారం అందించి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: One dead in road accident.