అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా సక్రమంగా ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్ గారు మరియు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.
అనకాపల్లి ముచ్చట్లు:
జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సమన్వయంతో చేపడుతున్న ముందస్తు చర్యలు: జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ (Civil Supplies) మరియు పోలీస్ శాఖలతో కూడిన ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్‌లను నిరంతరం తనిఖీ చేస్తున్నాయి. బంక్‌లలో ఉన్న నిల్వలు మరియు విక్రయాల తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధనాన్ని నిల్వ ఉంచినా, కృత్రిమ కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే బంక్ నిర్వాహకులపై లైసెన్సుల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి.
ఎస్‌హెచ్‌ఓ & ఎస్‌డిపిఓ: తమ పరిధిలోని పెట్రోల్ బంక్‌ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై సైబర్ క్రైమ్ నిఘా ఉంది.
జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా అందుబాటులో ఉంది. ప్రజలు తమ అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దు.
పెట్రోల్ బంక్‌ల వద్ద ఇబ్బందులు ఎదురైనా లేదా ఎవరైనా బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసినా వెంటనే డయల్ 100/112 కు సమాచారం అందించండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
”జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలందరూ పోలీసు మరియు రెవెన్యూ యంత్రాంగానికి సహకరించి శాంతిభద్రతలను కాపాడాలని కోరుతున్నాము.”
Tags: Fuel stocks in the district are abundant—the public need not worry.