March 15, 2026
Explore
తాతకాడే పడుకుంటాం…

తాతకాడే పడుకుంటాం…

March 15, 2026 | Andhra Pradesh


-మృత్యులోను వీడని తాత , మనవడు, మనవరాళ్ల బంధం

పుంగనూరుముచ్చట్లు:

నాయనా…. మేము తాత కాడే పడుకుంటాం….మీరు మిద్దెపైన పడుకోండి….అంటు తాత, మనవడు, మనవరాళ్ల అనుబంధాన్ని, శనివారం రాత్రి కన్నబిడ్డలు మాట్లాడిన మాటలను తలచుకుంటు ఆతల్లిదండ్రుల రోధనలు పలువురిని కలచివేసింది. పట్టణంలోని త్యాగరాజవీధిలో నివాసం ఉన్న మురళి, రేవతి దంపతులకు నలుగురు పిల్లలు. పెద్ద కుమారుడు కార్తీక్‌ (15), సుమబిందుతో పాటు కవల పిల్లలు చరిత (7), చందన(7)లు జన్మించారు. తాత కూలీ పనులు చేస్తూ , తండ్రి కులవృత్తి చేస్తూ ఎంతో సంతోషంగా ఎలాంటి చింత లేకుండ అందరితో కలసిమెలసి ఉంటున్న ఆకుటుంబంపై తమ సొంత ద్విచక్రవాహనమే కభలించేస్తుందని మురళి, రేవతి దంపతులు ఊహించలేకపోయారు. వాహనాన్ని మరమ్మతులు చేసుకొచ్చి బయట వీధిలో పెడితే దొంగల బెడతో పాటు ఇరుగుపొరుగు వారికి రాత్రంతా శబ్ధాలు అవుతుందని గ్రహించి, ఇంటిలోపాల హాల్‌లో స్టార్ట్చేసి ఉంచాడు. వాహనంలోని కార్భన్‌ మోనాక్సెడ్‌ విషవాయువులు బయటకు వెళ్లేందుకు కీటికిలు లేకపోయిన మృత్యుమాత్రం ఆనలుగురిని ఇంట్లో దూరి కభలించేసింది. తాత, మనవడు, మనవరాళ్ల వీడని అనుబంధం నిద్రపోతు నిద్రలోనే చనిపోతామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. నిద్రలో అందరు కలసి అనుబంధాలను పెంచుకుంటు , మృత్యువులోను కలసి ప్రాణాలు పోగొట్టుకోవడం పట్టణ ప్రజలను కలచివేసింది.

Tags: We’ll sleep right next to Grandpa.