పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం బిసి సంఘం సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయుకులు తమ్మిరెడ్డి పల్లి కృష్ణమూర్తి కి నేడు బిసి సంఘం నాయకులు ధనుంజయ్,రిటైర్ట్ డి ఎస్పీ సుకుమార్ బాబు , గంపల గంగరాజు ల ఆధ్వర్యంలో ఘనంఘ సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి లో బిసి సంక్షేమం కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి గా కృష్ణ మూర్తి ప్రజల మనిషి అని మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసి ఎందరికో అయన ఆదర్షంగా నిలిచారాని, ముఖ్యంగా బిసి సంక్షేమం కోసం బిసిలు నాయకులుగా రాణించాలని అయన పోరాటాలు చేశారన్నారు. బోయకొండ చైర్మన్ గా బోయకులస్థులు గంపల గంగరాజు కోసం బోయకొండ కు పాదయాత్ర చేపట్టడం లో ప్రముఖ పాత్ర పోషించారన్నారు.రానున్న రోజుల్లో బోయ కులస్థులు గంగ రాజు కి బోయకొండ చైర్మన్ గా నియమించాలని,బిసి భవన నిర్మాణం చేపట్టి ఆయన ఆశయాలు నెరవేర్చలని అన్నారు. బీసీలు ఐక్యత ముఖ్యం అని, ఇక రానున్న రోజుల్లో కృష్ణమూర్తి వారి ఆశయాలు నెరవేర్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. గత ముప్పై సంవత్సరాలు గా కృష్ణ మూర్తి తన కుటుంబం కోసం ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ది పొందలేదని వారి కుటుంబం నకు బిసి సంఘాలు ఆదుకోవాలని కోరారు.సంతాప కార్యక్రమం లో మదనపల్లి బిసి సంఘ నాయకులు బెస్త సంఘ నాయకులు రమణ, బంగారు నారాయణ స్వామి,ధనుంజయ,అద్దాల నాగరాజా,న్యాయవాది, శ్రీనివాసులు,జనార్దన, లక్ష్మయ్య,సీపీఐ వెంకటరమణ రెడ్డి,దొరసామి,రాజశేఖర్,గడిదేశీ వెంకటరమణ, వి. కె. వెంకటరామయ్య, ఉగ్రండం శివప్రకాష్,గండికోట శ్రీనివాసులు, సజ్జద్,చాంద్ బాషా,అల్తాఫ్బాషా ,సతీష్ కూమర్ రాజు,బెస్త సంఘం నాయకుడు నగరి సుబ్రహ్మణ్యం బాబు,ఎస్సి జె ఎస్సి నాయకులు విజయ్ ప్రతాప్,జె వి. నాగరాజ,రవి గుప్తా,ప్రతిమ, చెట్టెమ్మ తదితర ఎస్సి ఎస్టీ, మైనారిటీ బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు.
Tags: BC Association leaders paid rich tributes to Krishnamurthy of the BC Welfare Association.