April 24, 2026
Explore
డ్వాక్రా నిధులు స్వాహా.. వ్యవహారం లో ..గ్రూపు లీడర్ అరెస్ట్: సీఐ రాజేష్

డ్వాక్రా నిధులు స్వాహా.. వ్యవహారం లో ..గ్రూపు లీడర్ అరెస్ట్: సీఐ రాజేష్

April 24, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:


దాచేపల్లి పొదుపు సంఘం నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న దాచేపల్లిలోని ‘యాసిన్’ పొదుపు గ్రూపు లీడర్ నూర్జహాన్ను పోలీసులు అరెస్టు చేశారు.

సంఘానికి చెందిన రూ. 7 లక్షల నిధులను ఆమె గోల్మాల్ చేసినట్లు సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీఐ రాజేశ్ కేసు నమోదు చేశారు.

గురువారం నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

అనంతరం ఆమెను గురజాల జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags: DWCRA Funds Embezzlement Case: Group Leader Arrested — CI Rajesh