అమరావతిముచ్చట్లు:
రూ.64 కోట్ల స్కామ్ లో వాడిన 121 నకిలీ యాప్లను సృష్టించినందుకు 18 ఏళ్ల యువకుడు అరెస్టు.
సైబర్ మోసాల నెట్వర్క్ వెనుక సూత్రధారిగా ఉన్న 18 ఏళ్ల రోహిత్ శాక్యను గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
11వ తరగతిలోనే చదువు ఆపేసిన ఈ కుర్రాడు కోడింగ్, ఏఐ టెక్నాలజీతో బ్యాంకింగ్, ఆర్టీఓ పేరిట 121 నకిలీ యాప్లు రూపొందించాడు.
వీటిని సైబర్ నేరగాళ్లకు నెలకు రూ.15 వేల సబ్స్క్రిప్షన్కు అమ్మేవాడు.
ఈ యాప్ల ద్వారా మోసగాళ్లు దేశవ్యాప్తంగా 2,928 ఫోన్లను హ్యాక్ చేసి రూ.64.38 కోట్లు కాజేశారు.
Tags: 18-year-old arrested for creating fake apps.