రూ.19.50 లక్షల పరిహారం పంపిణీ
పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు కోర్టు ఆవరణంలో సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ ఆధ్వర్యంలో 416 కేసులను శనివారం పరిష్కరించారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్‌జడ్జి సుభాన్ తో కలసి ఆమె కేసులను పరిష్కరించారు. సీవిల్ కేసులు 10, క్రిమినల్ కేసులు 416 లు పరిష్కరించారు. ఇందులో పరిహారంగా రూ.19.50 లక్షలను అందజేశారు. న్యాయమూర్తి ఆరీఫాషేక్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కక్షలకు పోకుండ , స్నేహపూర్వక వాతావరణంలో కేసులను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులకు స్టాప్‌డ్యూటీలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ అదాలత్‌లో న్యాయవాదులు మల్లికార్జునరెడ్డి, భాలాజికుమార్, భాస్కర్‌రెడ్డి, విజయకృష్ణ, రవీంద్ర,కిషోర్‌తో పాటు అధికారులు , పోలీసులు పాల్గొన్నారు.
Tags: 416 Cases Resolved at Lok Adalat