April 24, 2026
Explore
మదనపల్లె గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

మదనపల్లె గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

April 24, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 3 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. రంగనాయకులు తెలిపారు. 3వ తరగతిలో 40 సీట్లు (ఎస్‌టీ-32, ఎస్‌సీ-5, బీసీ-2, ఓసీ-1) ఉండగా, 4వ తరగతిలో 36, 5వ తరగతిలో 32, 6వ తరగతిలో 25, 7వ తరగతిలో 21, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్థులకు ఉచిత వసతి, ఆహారం, పుస్తకాలు, యూనిఫాం సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Tags: Applications Invited for Admissions to Madanapalle Gurukula School