- ఎంపి మిధున్‌రెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్రం, దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలిఆస్తులను మనమే కాపాడుకోవాలని ఎంపి మిధున్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్బోర్డు బిల్లుకు వైఎస్సార్‌సిపి ఎంపిలు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు వక్ఫ్బోర్డు బిల్లును వ్యతిరేకించామన్నారు. రాష్ట్రంలో వక్ఫ్బోర్డు ఆస్తులను కాపాడుతామని , ప్రస్తుతం ఇతర సంస్థల ద్వారా ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింకు అండగా ఉంటామన్నారు. ఏ ఆపద వచ్చిన తాము దగ్గరుండి ముస్లింలను ఆదుకుంటామని, ఎవరు ఆధైర్యపడరాదని సూచించారు. వైఎస్సార్‌సిపికి అండగా ఉన్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Tags: We ourselves must protect the Waqf Board assets.