March 14, 2026
Explore
ముస్లిం రుణం తీర్చుకోలేం

ముస్లిం రుణం తీర్చుకోలేం

March 14, 2026 | Andhra Pradesh

  • ఇఫ్తార్‌కు రూ.4.35 లక్షలు
  • ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

ముస్లింలకు ఎంత సేవ చేసిన వారి రుణం తీర్చుకోలేమని వైఎస్సార్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లు తెలిపారు. శనివారం పట్టణంలోని అంజుమన్‌ కమిటి హాల్‌లో ఎమ్మెల్యే, ఎంపి కలసి ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యే, ఎంపి లను సన్మానించారు. పట్టణంలోని 29 మసీదులలో ఇఫ్తార్‌ నిర్వహించేందుకు ప్రతి ఏటా ముస్లింలకు పెద్దిరెడ్డి కుటుంబం ఇఫ్తార్‌ విరాళం రూ. 4.35 లక్షలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ముస్లింలతో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి ముస్లింలు వెన్నెముకగా నిలిచారన్నారు. తమ కుటుంభానికి తొలినుంచి ముస్లింలు అండగా ఉంటు , తమ కుటుంబ అభివృద్ధికి ఎంతగానో దోహం చేశారని కొనియాడారు. ముస్లింల అభివృద్ధికి తమ కుటుంబం శక్తివంచన లేకుండ సేవ చేస్తుందని తెలిపారు. ఎల్లప్పుడు ముస్లింల ఆశీస్సులు తమ కుటుంభానికి అందించాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, మైనార్టీ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఇక్భాల్‌, ముతవల్లిలు, అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, జింకావెంకటాచలపతి, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, అమరనాథరెడ్డి, కొత్తపల్లె చెంగారెడ్డి, ముస్లిం పెద్దలు , కిజర్‌ఖాన్‌, ఇంతియాజ్‌, నూరుల్లా, ఖాదర్‌, మహబూబ్‌బాషా, ఇర్ఫాన్‌, తదితరులు పాల్గొన్నారు.

బాబు మాటలు నమ్మకండి….

తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు మాటలు నమ్మరాదని పెద్దిరెడ్డి సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేదని దుయ్యబట్టారు. ముస్లింలకు ఎనాడు గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. పరిపాలనలో భాగస్వామిగా ఉన్న ఉపముఖ్యమంత్రి ఎమైన పట్టించుకుంటున్నారా ….ఆయన ఎమ్మెల్యేలకైన ఇంటర్వ్యూ ఇచ్చారా అంటు నిలధీశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలని నేరవేర్చారని, ముస్లిం మైనార్టీలకు అగ్రస్థానం కల్పించారని కొనియాడారు. నమ్మకంతో జగన్‌కు అండగా ఉండాలని , ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు.

Tags: We cannot repay the debt owed to Muslims.