March 14, 2026
Explore
ఏపీ పదో తరగతి విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం’ టెన్షన్ లేదు, కాకపోతే కండిషన్స్ అప్లై

ఏపీ పదో తరగతి విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం’ టెన్షన్ లేదు, కాకపోతే కండిషన్స్ అప్లై

March 14, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 6,40,916మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది టెన్త్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఇబ్బందిపడకుండా.. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మొబైల్‌తో స్కాన్ చేసి పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించి క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు.

అంతేకాదు పదో తరగతి హాల్‌టికెట్‌పై పరీక్షలకు సంబంధించిన వివరాలు కూడా ముద్రించారు. అలాగే రెండు పరీక్షల మధ్య సెలవులు వచ్చేలా టైం టేబుల్ ఉంది. అంతేకాదు టెన్త్ విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లడానికి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం నిమిషం నిబంధనను కూడా పక్కన పెట్టింది. ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30గంటలకు ప్రారంభం అవుతంది.. మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతుంది. అయితే ఎగ్జామ్ సెంటర్‌లలోకి విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంగణంలోకి అనుమతిస్తారని అధికారులు తెలిపారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా అనుమతిస్తామన్నారు.

ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 13 వరకు మూల్యాంకన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాల్యూషన్ ఉంటుంది. ఇంటర్ వాల్యూషన్ కోసం 26 జిల్లా కేంద్రాల్లో స్పెషల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఈ సెంటర్లకు క్యాంపు అధికారులుగా ఆయా జిల్లాలకు చెందిన విద్యాధికారులు ఉంటారు. ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు రోజుకు 40 చొప్పున జవాబుపత్రాలు మాత్రమే ఇస్తారు. అంతేకాదు మూల్యాంకనం తర్వాత మార్కుల లెక్కింపులో తప్పులకు ఆస్కారం లేకుండా ట్యాబ్‌ల్లో నమోదు చేసే విధానం తీసుకొస్తున్నారు అధికారులు.

Tags:Relief for AP 10th Grade Students: No More ‘One-Minute’ Tension—However, Conditions Apply.