April 20, 2026
Explore
బాధితుల కళ్లలో ఆనందమే మాకు అసలైన తృప్తి

బాధితుల కళ్లలో ఆనందమే మాకు అసలైన తృప్తి

April 20, 2026 | Andhra Pradesh

: శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్.

రికవరీ చేసిన రూ. 27 లక్షల విలువైన 135 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ.

సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.

ప్రజలు వారి మొబైల్ ఫోన్ వీలైనంతవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి

వేసవి సెలవుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఇళ్ల వద్ద జాగ్రత్తలు పాటించాలి.
ఇంటి ముందు భాగంలో వెనుక భాగంలో గ్రిల్ గేట్లు ఏర్పాటు చేసుకోండి

శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన మరియు ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి, వాటిని తిరిగి బాధితులకు అందజేయడం జరిగింది జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందజేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, , అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ఐపీఎస్ తో కలిసి రూ. 27 లక్షల విలువ చేసే 135 మొబైల్ ఫోన్లను బాధితులకు స్వయంగా జిల్లా ఎస్పీ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు:

మొబైల్ ఫోన్ చోరీకి గురైన పోగొట్టుకున్న తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.

లేదా CEIR పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మొబైల్ ఫోన్ అనేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదని, అది మనిషి జీవితంలో ఒక భాగమైపోయిందని ఎస్పీ పేర్కొన్నారు. ఫోన్లలో ఉండే వ్యక్తిగత సమాచారం, ఫోటోలు మరియు జ్ఞాపకాలతో ప్రజలకు ఉండే సెంటిమెంట్‌ను గౌరవించి, ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచి ఈ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు.

మొబైల్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో మీ ఐఎంఈఐ (IMEI) నంబర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేస్తే, ఫోన్ రికవరీ చేయడం సులభతరం అవుతుంది.

కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త:
తక్కువ ధరకే వస్తున్నాయని ఆశపడి ఎటువంటి బిల్లులు లేని పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయవద్దని ఎస్పీ హెచ్చరించారు. బిల్లులు లేకుండా కొనే ఫోన్లు దొంగిలించబడినవి అయ్యే అవకాశం ఉందని, అటువంటి ఫోన్లను వాడటం వల్ల అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లు జాగ్రత్త పరుచుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఈ సెల్ఫోన్లో రికవరీ చేయడంలో బాగా పనిచేసిన సిసిఎస్, ఐటి కోర్, సైబర్ క్రైమ్ సిఐ లు గోపీనాథ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సతీష్ కుమార్, సిబ్బంది కృష్ణానాయక్ ,నరసింహమూర్తి, శీను చంద్ర, షామీర్ లను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

వేసవి సెలవులు – ఊరు వెళ్తున్నారా ఇంటి వద్ద జాగ్రత్త

వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో తమ ఆస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు:

సీసీ కెమెరాల ఏర్పాటు: ప్రతి ఒక్కరూ తమ ఇల్లు మరియు వ్యాపార సంస్థల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇది నేరగాళ్లను గుర్తించడానికే కాకుండా, నేరాలు జరగకుండా అడ్డుకోవడానికి దోహదపడుతుంది.

భౌతిక భద్రత: ఇంటి ముందు మరియు వెనుక భాగాలలో దృఢమైన గ్రిల్ గేట్లను ఏర్పాటు చేసుకోవాలి.

నగదు మరియు బంగారు ఆభరణాలు: సెలవుల్లో వెళ్లేటప్పుడు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు లేదా బంగారాన్ని ఉంచకుండా, బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు.

సమాచారం అందించండి: ఎక్కువ రోజులు ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీసులకు లేదా పొరుగువారికి సమాచారం అందించడం మంచిది.

“బాధితులు తమ పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందినప్పుడు వారి కళ్లలో కనిపించే సంతోషం చూస్తుంటే, మా పోలీస్ బృందం పడిన శ్రమ అంతా మర్చిపోతున్నాం. ప్రజల సహకారంతో జిల్లాలో నేరాలను అరికట్టి శాంతిభద్రతలను కాపాడతాం” అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు,అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఐపీఎస్ , సిసిఎస్, డిటిఆర్బి సిఐ లు గోపీనాథ్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి సతీష్ కుమార్ సైబర్ ఐటి కోర్ట్ పోలీస్ అధికారులు, ఐటి కోర్ టీం సభ్యులు మరియు బాధితులు పాల్గొన్నారు.

Tags; The happiness in the eyes of the victims is our true satisfaction.