April 19, 2026
Explore
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ – సత్ప్రవర్తనకు మారాలని సూచించిన పోలీసులు.

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ – సత్ప్రవర్తనకు మారాలని సూచించిన పోలీసులు.

April 19, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహణ.
  • రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్.
  • అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కఠినంగా సూచనలు.
  • శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిరంతర నిఘా.
  • పునరావృతంగా నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించి కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గుర్తించిన రౌడీషీటర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు పిలిపించి, వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సవివరంగా సూచనలు చేశారు.
  • ఈ సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లకు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడడం వల్ల వారి భవిష్యత్తు మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని వివరించారు.
  • అలాగే, తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ చట్టం వంటి కఠిన నిబంధనల కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి రౌడీషీటర్ కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని స్పష్టం చేశారు.
  • జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తూ, ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని పోలీసులు తెలిపారు.

Tags; Counseling for Rowdy-Sheeters – Police Urge Them to Adopt Good Conduct.