April 18, 2026
Explore
బసినికొండలోని లారీ షెడ్డులో అగ్ని ప్రమాదం

బసినికొండలోని లారీ షెడ్డులో అగ్ని ప్రమాదం

April 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పుంగనూరు రోడ్డులోని బసినికొండలోని లారీ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగి, సుమారు 20వేల ఆస్తినష్టం వాటిల్లింది. శనివారం అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాలు.. బసినికొండ లో షంషీర్ కు లారీ షెడ్డును ఉందని తెలిపారు. అర్ద రాత్రి షెడ్డు పక్కన ఉన్న చెత్తకు ఎవరో సిగరెట్ తాగి పడేయడంతో మంటలు వ్యాపించి, లారీ షెడ్డుకు అల్లుకున్నాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందితో వెళ్లి భారీ ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసి, ఆస్తినష్టం జరగకుండా చూశామని శివప్ప తెలిపారు.

Tags:Fire Accident at the Lorry Shed in Basinikonda