April 16, 2026
Explore
డ్రంక్ & డ్రైవ్ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధింపు. రూ.10,000/- జరిమానా.

డ్రంక్ & డ్రైవ్ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధింపు. రూ.10,000/- జరిమానా.

April 16, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు.
  • రోడ్డు భద్రతపై జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్న పోలీసులు.
  • తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ & డ్రైవ్ కేసులో నిందితుడికి గౌరవ స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు,కఠిన శిక్ష విధించింది.
  • కేసు వివరాల ప్రకారం, నిందితుడు మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు ముందు హాజరై తన తప్పును ఒప్పుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన గౌరవ కోర్టు, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185(a) కింద నేరాన్ని నిర్ధారించి, BNSS సెక్షన్ 275 ప్రకారం దోషిగా తేల్చింది. తదనుగుణంగా నిందితుడికి 16.04.2026 నుండి 20.04.2026 వరకు 05 రోజుల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.10,000/- జరిమానా విధించారు.
  • నిందితుడు వివరాలు:
  • అభినవ్ కుమార్ సింగ్, వయస్సు 32 సంవత్సరాలు, తండ్రి ఉమేష్ ప్రసాద్ సింగ్, పోఖరాహా గ్రామం, అతిమి మండలం, రోహ్తాస్ జిల్లా, బీహార్ రాష్ట్రం.
  • ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమైన నేరమని, ఇది వ్యక్తిగత ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని తెలిపారు. డ్రంక్ & డ్రైవ్‌పై తిరుపతి జిల్లా పోలీసులు జీరో టోలరెన్స్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
  • ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటూ, కోర్టుల ద్వారా శిక్షలు విధించేలా చర్యలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొంటూ, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకూడదని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
  • యువత ప్రత్యేకంగా బాధ్యతతో వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని కోరారు.
  • జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు నిరంతరం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిన్నటి దినం కూడా ఒకరికి ఈరోజు కూడా ఒకరికి జైలు శిక్ష పండిందని పేర్కొన్నారు.

Tags: Accused sentenced to jail in a drunk and drive case; fined ₹10,000.