” – అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్ర హెచ్చరిక..
మదనపల్లి ముచ్చట్లు:
అంతర్జాతీయ పరిణామాల సాకుతో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ, ధరలు పెరిగాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సాధారణంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. వాస్తవాలు తెలుసుకోకుండా వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) ఇతర సామాజిక మాధ్యమాలలో గ్యాస్ సిలిండర్ల గురించి తప్పుడు సమాచారం సృష్టించినా, ఫార్వార్డ్ చేసినా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం.కృత్రిమ కొరత సృష్టించి, గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయించే అక్రమార్కులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు.ప్రజలు గాలి వార్తలను నమ్మి భయపడవద్దు. ప్రభుత్వ మరియు చమురు సంస్థల అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరుతున్నాం.
Tags: Strict action will be taken against those who write fake news on gas cylinders!
ఎవరైనా అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నా లేదా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా 112 నెంబర్ కు డయల్ చేసి సమాచారం అందించాలి.
ప్రజల భయాందోళనలను సొమ్ము చేసుకోవాలని చూసే వారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ఎస్పీ గారు హెచ్చరించారు.