April 12, 2026
Explore
ఇతగాడు మామూలోడు కాదు

ఇతగాడు మామూలోడు కాదు

April 12, 2026 | Andhra Pradesh

మధ్యప్రదేశ్‌ముచ్చట్లు:

సినిమాల్లో హీరోలు నీళ్లలో దాక్కుని పైపుతో గాలి పీల్చుకోవడం చూసుంటారు కదా?

మధ్యప్రదేశ్‌లో ఒక దొంగ దాన్ని రియల్ లైఫ్‌లో హీరో లెక్క ట్రై చేశాడు.
రైళ్లలో చేతివాటం ప్రదర్శించే ఈ ఘనుడు, పోలీసులను చూసి భయంతో పక్కనే ఉన్న చెరువు ( మురికి కాలువ ) లోకి దూకాడు.

ఆఁ సువాసన గల చెరువులో దూకడమే కాకుండా, ఒక తామర కాడను నోట్లో పెట్టుకుని ఏకంగా 5 గంటల పాటు జలకన్యలా నీళ్లలోనే ఉండిపోయాడు.

పోలీసులు కూడా తక్కువ తినలేదు😂.
నువ్వు తామర కాడతో గాలి పీలిస్తే. మేము గాలం వేసి మరీ పట్టుకుంటాం అని డైవర్లను ఆఁ మురికి కాలువలోకి దింపి మరీ ఆఁ హీరోని బయటకు లాగారు.

వాడు వేసిన ప్లాన్ చూసి చేపలు కూడా షాక్ అయి ఉంటాయి. చివరికి ఐదు గంటల స్నానం తర్వాత, పోలీసులు వాడికి పోలీస్ స్టేషన్ కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.

ఈ హీరో ఐడియాకి ఒక మార్కు వేయొచ్చా?
లేదా ఇతగాడు ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యుంటాడు?

వార్త లేటు గా వచ్చినా …ప్లాన్ మాత్రం కేక పుట్టించింది …కానీ ఖాకీలు కాటేసారు.

Tags: This guy is no ordinary person.