రాజుపాలెం ముచ్చట్లు:
రాజుపాలెం మండలం అంచులు వారి పాలెం గ్రామానికి చెందిన నీలం వెంకయ్య భార్య అంకమ్మ గుంటూరు హాస్పిటల్ కి వెళ్లి చూయించుకొని తిరిగి వచ్చే క్రమంలో అనుపాలెం సాగర్ కాలువ వద్ద బైక్ పై వస్తున్న తరుణంలో లారీ రావడం జరిగింది.
లారీని తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు భార్యాభర్తలు ఇద్దరు కాలువ లో పడిపోయారు.
స్థానికులు గమనించి భర్తను బయటకు తీయగా భార్య అంకమ్మ కాలువలో కొట్టుకొని పోయింది.
ఈ సందర్బంగా అంచులు వారి పాలెం మరియు అనుపాలెం గ్రామస్తులు కాలువ వెంబడి వెతుకుతున్న క్రమంలో
బెల్లంకొండ మండలం మాచయ పాలెం గ్రామ పరిధిలో సాగర్ కాలువ లాకుల వద్ద అంకమ్మ మృతదేహాన్ని గమనించి స్థానికులు తెలియజేయగా
పోలీస్ లు పోస్టుమార్టం నిమిత్తము సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి అంకమ్మ శవాన్ని తరలించారు.
Tags; Woman Dies After Accidentally Falling into Anupalem Sagar Canal