March 11, 2026
Explore
జాతరకు వచ్చి ఇద్దరు యువకులు మృతి

జాతరకు వచ్చి ఇద్దరు యువకులు మృతి

March 11, 2026 | Andhra Pradesh

  • ఒకరికి తీవ్ర గాయాలు

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరులో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న బలోరాజీపు ఢీకొని , విద్యుత్‌ స్తంభాన్ని కూడ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందిన బుధవారం వేకువజామున జరిగింది. పెద్దపంజాణి మండలం కమ్మినాయునిపల్లెకి చెందిన భరత్‌(20), శ్రీధర్‌(22), గిరి (20)లు ద్విచక్రవాహనంపై జాతర చూసుకుని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో మాదనపల్లె క్రాస్‌ వద్ద బలోరాజీపు ఢీకొని , అక్కడే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని కూడ ఢీకొంది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా గిరి ప్రాణపాయ దశలో ఉన్నాడు. వెంటనే ఆప్రాంత వాసులు గమనించి 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విద్యుత్‌ స్తంభం కూలిపోయింది. పంజాణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Two youths die while attending a fair