April 11, 2026
Explore
మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్.. 1800224344

మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్.. 1800224344

April 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పటివరకు 14.2 కిలోల ఇంట్లో వాడే సిలిండర్, హోటల్స్, రెస్టారెంట్ల లాంటి వ్యాపారాలకు వాడే 19 కిలోల సిలిండర్ గురించి మనందరికీ తెలుసు…

అయితే ఇప్పుడు 5 కిలోల సిలిండర్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.

ఈ మేరకు అన్ని గ్యాస్ కంపెనీలు 5 కేజీల సిలిండర్‌ను ప్రవేశపెట్టాయి.

ఇటీవల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగిన క్రమంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్ కంపెనీలన్నీ ఈ చిన్న సిలిండర్లను మార్కెట్లోకి తెచ్చాయి.

అద్దెఇళ్లల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు, వలస కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది.

దీని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అడ్రస్ అవసరం లేదు
ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే అడ్రస్ ఫ్రూఫ్ అవసరమయ్యేది.

అలాగే అప్లికేషన్ ఫారంలు పూర్తి చేయాల్సి వచ్చేది.

అయితే 5 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరమే లేదు.

కేవలం ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది.

మీ సమీపంలోని ఏ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అయినా అప్పటికప్పుడు దీనిని తీసుకుని వెళ్లవచ్చు.

గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు ముందే బుక్ చేసుకుంటే ఇంటికి రావడానికి సమయం పడుతుంది.

అదే ఈ చిన్న సిలిండర్‌ను మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి లేదా సమీపంలోని దుకాణాల్లో సులువుగా రీఫిల్లింగ్ చేసుకోవచ్చు.

తక్కువ ధరకే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛోటు పేరుతో 5 కేజీల సిలిండర్ లాంచ్ చేసింది.

పెట్రెల్ పంపుల్, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇండేన్ పంపిణీదారుల వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఏ నగరంలో అయినా దీనిని వినియోగించుకోవచ్చు.

ఇక భారత్ గ్యాస్ మినీ సిలిండర్‌ అయితే మీ ఇంటి వద్దకే వచ్చేస్తుంది.

1800224344 నెంబర్‌కు కాల్ చేస్తే రెండు గంటల్లోనే మీ ఇంటికి డెలివరీ చేస్తారు .

అయితే రూ.25 డెలివరీ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది.

ఇక హెచ్ పీ గ్యాస్ అప్పు పేరుతో 5 కేజీ ల సిలిండర్ ప్రవేశపెట్టింది.

పెట్రోల్ బంక్‌లు, విక్రయ కేంద్రాలు, కిరాణా దుకాణాల్లో దీనిని పొందవచ్చు.

Tags: 5 kg Gas Cylinder Enters the Market — 1800224344