April 10, 2026
Explore
వైభవంగా ప్రారంభమైన చీమనపల్లెలో దర్గా ఉరుసు

వైభవంగా ప్రారంభమైన చీమనపల్లెలో దర్గా ఉరుసు

April 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా, ఫకీర్‌షావలిబాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి గంధంతో వైభవంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు కోసం దర్గాను విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో దువ్వ చేశారు. రాత్రి గంధం, ఫకీర్ల వాయిద్యాలు , బాణసంచాలు, విద్యుత్‌ దీపాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి దర్గాలో ఉరుసు మహ్గత్సవాన్ని ప్రారంభించారు. శని, ఆదివారాలలో ముంబైకి చెందిన అఫ్రిన్‌సుల్తాన, మైసూర్‌కు చెందిన సలీంరిష్టి, గుజరాత్‌కు చెందిన ఆసిఫ్‌అజ్మీర్‌, ఇంతేజుర్‌రిష్టి లచే రెండు రోజుల పాటు ఉరుసు , ఖవ్వాలి పాటల పోటీలు ఎంతో ఆసక్తిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉరుసు మహ్గత్సవానికి వచ్చే వేలాది మంది భక్తులకు రానుండటంతో ప్రతి రోజు దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉరుసు మహ్గత్సవానికి కులమతాలకతీతంగా హిందూముస్లిం సోదరులు పాల్గొనడం గమనార్హం.

Tags:Dargah Urs Begins Grandly in Cheemanapalle