గెరిగెలతో మోక్కులు చెల్లించిన భక్తులు
-గ్రామాల్లో జాతర సందడి
- విందువినోదాలతో కాలక్షేపం
పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు ప్రజల ఆరాధ్య దైవం ,జమీందారుల కుల దైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరకు భక్తులు పోటేత్తారు. బుధవారం అమ్మవారిని భక్తుల సందర్శనార్థం ప్యాలెస్ ఆవరణంలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో ఉంచారు. అమ్మవారికి తొలి పూజలు జమీందారులు నిర్వహించారు. తరువాత బెస్తవారు, ఆసాధి, తోటి కులస్తులు, యాదవ కులస్తులచే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి అమ్మవారికి సారె పెట్టి ఆడబిడ్డలాంచనాలతో పూజలు చేశారు. అనంతరం ఉదయం భక్తుల దర్శనానికి అనుమతించారు. జాతర కు ఆంధ్రా , కర్నాటక, తమిళనాడుకు చెందిన ప్రజలు లక్షలాది మంది ప్రజలు హాజరై అమ్మవారికి మోక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు ఆడవారి వేషదారణలో అమ్మవారికి వెహోక్కులు చెల్లించారు. మట్టి కుండలకు మామిడి ఆకు, వేపాకు, పూలు పెట్టి గెరిగెలు తయారు చేసి గెరిగెలను మహిళలు, పురుషులు వచ్చి ఆలయంలో మూడు ప్రదక్షణలు చేసి , వెహోక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో జంతుబలులు సమర్పించారు. బంధుమిత్రులతో కలసి ఇంటింటా విందు భోజనాలతో గడిపారు.
జాతర హ్గరు….
పట్టణంలోని విరూపాక్షి మారెమ్మను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారికి వేల సంఖ్యలో భక్తులు హాజరై మోక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పట్టణంలో అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. అలాగే బజారువీధిలో నడివీధి గంగమ్మ , తూర్పు మోగసాలలో గంగమ్మ , బాలాజి •యేటర్ వద్ద మలారమ్మ గంగమ్మ, మైసూర్ బ్యాంకు వద్ద నలగంగమ్మ, బస్టాండులో విరూపాక్షి మారెమ్మ, నల్లరాళ్లపల్లె వద్ద నలగంగమ్మ , కోనేరు వద్ద బోయకొండ గంగమ్మ, నానాసాహెబ్‌పేటలోని నడివీధి గంగమ్మలను ఉంచి పట్టణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అమ్మవారి కటౌట్లు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తి గీతాలతో పట్టణం భక్తిపారవశ్యమైంది.
క్రిక్కిరిసిన జనం ….
మండుటెండలో వేలాది మంది భక్తులు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో పాల్గొని వెహోక్కులు చెల్లించుకున్నారు. కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వేసవి తీవ్రంగా ఉండటంతో ఆలయం ప్రాంగణం వద్ద చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీటితో పాటు వైద్యశిబిరాలు, చలివేంద్రాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే అడిషినల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు, సిబ్బంది సుమారు 250 మంది పొలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
నిమజ్జనం…
పట్టణంలో మంగళ, బుధవారాలలో రెండు రోజుల పాటు జరిగిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర గురువారం వేకువజామున ముగిసింది. అమ్మవారికి జమీందారులు మలిపూజలు నిర్వహించారు. వేకువజామున పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహించి, అమ్మవారిని నిమజ్జనం చేసి, అమ్మవారి విగ్రహాన్ని జమీందారులకు అప్పగించారు.












Tags: People flock to the Gangamma fair in Srisugutur