96 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 96 కొత్త కోర్టుల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. వీటిలో 12 జిల్లా సెషన్స్ కోర్టులు, 25 సీనియర్ సివిల్ కోర్టులు, 59 జూనియర్ సివిల్ కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టుల నిర్వహణ కోసం కొత్తగా 1,730 పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కేసుల విచారణ వేగవంతమై, న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు రానున్నాయి.
Tags: Green Signal for the Establishment of 96 New Courts