అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం రాపూరివాండ్లపల్లెలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బత్తల సురేష్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వైజాగ్ లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సెలవుపై ఇంటికి వచ్చి సమీపంలోని దోసకాయల తోటలో శవమై కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మృతిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Tags: CRPF constable dies under suspicious circumstances in PTM mandal